
Favourite Foods Of Our Tollywood Actors
మద్రాస్ లో షూటింగులకు వెళ్లే రోజుల్లోనే దోసె ఫార్ములాని కనిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. రోడ్ సైడ్ కాకా హోటల్ ఫార్ములానే అయినా బాగా వర్కవుటైంది. ఆ దోసె ఎంతో రుచికరమైనది.. ఆరోగ్యానికి అందానికి మంచిదని మెగా ఫ్యామిలీ డిసైడ్ చేసింది. ఆ తర్వాత దానినే ఇంట్లో ట్రై చేశారు. ఫార్ములా వర్కవుటయ్యాక చట్నీస్ లో స్పెషల్ మెనూలో పొందుపరిచారు. ఇప్పటికీ హైదరాబాద్ కి వస్తే చెన్నయ్ స్టార్లు చట్నీస్ కి వెళ్లి మరీ చిరంజీవి దోసె తిని వెళతారు. అంతేనా నేరుగా చిరు ఇంటికే వెళ్లి దోసె కావాలని అడిగి మరీ తినే స్నేహితులు ఉన్నారు. ఎయిటీస్ స్టార్లు అంతా ఆ దోసె కోసం చొంగలు కారుస్తారని ఇంతకుముందే చాలాసార్లు రుజువైంది.
ఇక మెగా ఫ్యామిలీ స్టార్లు అందం కోసం ఆరోగ్యం కోసం ఇలాంటివి చాలా చేస్తారన్నది తెలిసిన విషయమే. మహేష్ .. రానా.. సమంత.. రకుల్ లాంటి స్టార్లు అందం ఆరోగ్యం కోసం ఏం చేస్తుంటారు? ఎలాంటి ఆహారం తింటారు? అంటే… వీళ్లంతా తమకు నచ్చినవాటిని త్యజిస్తున్నారట. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్న చందంగా ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. ఇష్టం కోసం తినకుండా ఆరోగ్యం కోసం కొన్నిటిని వదులుకుంటున్నారట.
ఆరోగ్యం కోసం అందం కోసం వీళ్లంతా డైట్ ని కంట్రోల్ చేసేస్తుంటారట. సూపర్ స్టార్ మహేష్ బిర్యానీకి డైహార్డ్ ఫ్యాన్. చేపల కూరల్లో వెరైటీల్ని కూడా ఆస్వాధిస్తారట. బిర్యానీ .. చేపల పులుసు రెండింటినీ మెనూలో ఉండాలనుకుంటాడు. కానీ.. అందం ఆరోగ్యం కోసం పరిమితుల దృష్ట్యా వాటిని అతిగా తినకుండా చూసుకుంటాడు. తన వ్యక్తిగత డైటీషియన్ సూచించిన విధంగా కఠినమైన డైట్ పాలనను అనుసరిస్తాడు. వ్యాయామాలు చేసే కేలరీలను బర్న్ చేయడం ద్వారా అదుపులో ఉంచుతాడట.
రెగ్యులర్ వర్కవుట్లతో అందరినీ ఆశ్చర్యపరిచే సమంత హాట్ ఫిల్టర్ కాఫీ .. స్వీట్ పొంగల్ ను ఇష్టపడుతుంది. ఇవే గాక కూరగాయల వంటకాలు.. సాంబార్ రైస్ ఇష్టమని సామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ప్రస్తుతం వంటగదిలో కొత్త వంటకాలను ప్రయత్నిస్తోంది. ఆరోగ్యం అందం కోసం కొన్నిటిని ఆల్టర్నేట్ చేస్తుంటుంది.
రానాకు అమ్మమ్మ చేతివంటలు చాలా ఇష్టం. అమ్మమ్మ సాంబార్ ను చాలా ఇష్టపడతాడు. అతను పాఠశాల నుండి వచ్చిన తరువాత తన అమ్మమ్మ తయారుచేసిన సాంబార్ వాసనను ఎలా ఇష్టపడుతున్నాడో .. దానిని ఇడ్లీలు లేదా దోసలతో ఎలా ఆరగించాడో ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాడు. ప్రస్తుతం తాను కఠినమైన డైట్ ను అనుసరిస్తున్నానని.. అందువల్ల తన తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకొని తిండి పదార్థాల్ని సిద్ధం చేస్తుందని అతను చెప్పాడు. తనకు హైదరాబాదీ బిర్యానీ.. హలీమ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. కానీ అందం ఆరోగ్యం కోసం నోరు కట్టేసుకోక తప్పదు.
అందాల రకుల్ ప్రీత్ పంజాబీ రుచుల్ని బాగానే ఆరగిస్తుంది. కానీ వాటిలో బరువు పెంచేవి పరిమితంగానే. అలు పరోటా.. గులాబ్ జామున్ లను పంజాబీలు ఇష్టంగా తింటారు. అలా తినడం తనకు చాలా ఇష్టమని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఇప్పటికీ ఆ అలవాటు పోలేదు. ఇక అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం జిమ్ చేయడాన్ని యోగాభ్యాసాన్ని రకుల్ విడువదు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
