Templates by BIGtheme NET
Home >> Cinema News >> పేదలకు ఇన్సూరెన్స్ సరే.. కోవిడ్ రోగులకు తక్షణ సాయం ఏదైనా?

పేదలకు ఇన్సూరెన్స్ సరే.. కోవిడ్ రోగులకు తక్షణ సాయం ఏదైనా?


భారతదేశంలో 50కోట్ల మంది పేదరికానికి ప్రధాన కారణం అనారోగ్యం.. ఆస్పత్రులకు పెట్టే ఖర్చు. నిజమే ఈ విషయాన్ని నిజాయితీగా చెప్పుకొచ్చారు మెగా కోడలు ఉపాసన కొణిదెల. ఇటీవలి కాలంలో కోవిడ్ 19 భారిన పడిన పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రుల భోగోతం రెగ్యులర్ గా టీవీల్లో జనం చూస్తున్నారు. కార్పొరెట్ ఆస్పత్రుల దోపిడీ కథల గురించి నిరంతర కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఇలా కార్పొరెట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి పేదల్ని కాపాడేందుకు దేవుడే అయ్యాడు దివంగత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పేరుతో నిరుపేదలు బడుగు బక్క ప్రాణులంతా కార్పొరెట్ వైద్యం చేయించుకునేందుకు అర్హుల్ని చేశారు. కార్పొరెట్ ఆస్పత్రులు దగుల్బాజీ డబ్బాటలో పేదలు బలి కాకుండా కొంతవరకూ నిలువరించగలిగారు. ప్రస్తుతం అంబులెన్సుల్ని పెంచి ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగిస్తున్నారు ఆయన వారసుడిగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. కోవిడ్ వేళ ప్రభుత్వ ఆస్పత్రుల్ని అలెర్టుగానే ఉంచారు సాధ్యమైనంత వరకూ. లోపాలు ఉన్నా.. కానీ సేవలు అందుతున్నాయి.

అదంతా సరే కానీ.. ఉపాసన కొణిదెల చెప్పినట్టు కార్పొరెట్ ఆస్పత్రులకు సొమ్ములు పోసి నాశనం అవుతున్న పేద కుటుంబాలకు దిక్కేది? ఆదుకునేందుకు మార్గం ఏదీ? అంటే ఇన్సూరెన్స్ అనే గొప్ప ఆలోచన. ఇప్పటికే ఐసీఐసీఐ లాంబార్డ్- స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ .. ఇలా రకరకాల ఇన్సూరెన్సులు ఉన్నాయి. ఇదే తరహాలో అపోలో గ్రూప్ తరపున ఓ ప్యాకేజీ ఇన్సూరెన్సును ప్రారంభించనున్నారు ఉపాసన. దీని వల్ల పేదలకు మేలు జరిగేలా చేయాలన్నది తన ప్లాన్. కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఉపాసన ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అయితే ఐసీఐసీఐ.. స్టార్ హెల్త్ లాంటి కంపెనీలు సంవత్సరానికి మినిమంగా భారీ మొత్తాల్ని వసూలు చేస్తున్నాయి. అంత మొత్తం కట్టేంత ఆదాయం పేదలకు ఉండదు. చాలా చిన్న మొత్తంతో పెద్ద ప్రయోజనం కలిగేలా.. ముఖ్యంగా కోవిడ్ కవరయ్యేలా ఉపాసన ఇన్సూరెన్స్ ను రూపకల్పన చేస్తున్నారా? అన్నదే అసలు పాయింట్. అయితే దీనికి తను ఇచ్చిన సమాధానం.. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే `ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన` స్కీమ్ లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది!! అని అన్నారు. స్కీమ్ లో చేర్పించి అందరికీ తక్షణ సాయం ఎలాంటి మతలబు లేకుండా చేయగలిగితేనే ఇది సఫలమైనట్టు.