ఇకనైనా ఆమె పబ్లిసిటీ హడావుడి తగ్గేనా?

0

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పూత్ మరణించినప్పటి నుండి కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ఈమె టార్గెట్ చేసి విమర్శలు చేయడం మొదలు పెట్టింది. బాలీవుడ్ మాఫియా కారణంగానే సుశాంత్ చనిపోయాడు అంటూ రెండు నెలలుగా వెబ్ మీడియా.. సోషల్ మీడియా.. ఎలక్ట్రానిక్ మీడియాల వేదికగా స్పీచ్ లు ఇచ్చేస్తుంది. మొదట ఈమె వాదనతో కొందరు ఏకీభవించినా ఆ తర్వాత తర్వాత ఈమె పై విమర్శలు మొదలయ్యాయి.

ఈమెను ఎంతగానే అభిమానించే వారు సైతం ఈమె తీరు పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నట్లుగా ఉంది అన్నారు. సుశాంత్ మరణంను తన వ్యక్తిగత పగ తీర్చుకునేందుకు అనుకూలంగా మార్చుకుంటుందేమో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా సుశాంత్ కుటుంబం తరపు లాయర్ గా వ్యవహరిస్తున్న వివేక్ సింగ్ స్పందిస్తూ కంగనా తన వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నట్లుగా ఆయన అనుమానాలు వ్యక్తం చేశాడు.

కెరీర్ ఆరంభంలో నెపొటిజం వల్ల సుశాంత్ ఇబ్బంది పడి ఉంటాడు. కాని ఇప్పుడు అతడి మరణంకు నెపొటిజం మాత్రం కారణం అయ్యి ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సుశాంత్ మృతిని కంగనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు కూడా పలువురు ఆమె తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. ఒకరి చావును ఇలా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించడం ఏమాత్రం సబబు కాదంటూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కంగనా తన పరువును తానే తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికి అయినా ఆమె పబ్లిసిటీ హడావుడి తగ్గిస్తుందేమో చూడాలి.