ఫ్రీ టైంను అలా వాడేసిన అల్లుడు అదుర్స్ టీం

0

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ మద్యలోనే ఆగిపోయింది. ఆ ఆరు నెలల ఖాళీ టైమ్ లో స్క్రిప్ట్ కు అనేక మార్పులు చేర్పులు చేయడం జరిగిందట. ప్రముఖుల సలహాలు మరియు సూచనలు తీసుకోవడంతో పాటు సీనియర్ ల సహాలను కూడా ఈ స్క్రిప్ట్ కోసం తీసుకున్నారట. ఇప్పటికే తీసిన కొన్ని సీన్స్ ను కూడా రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కందిరీగ వంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ ను బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసేందుకు సంతోష్ శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఎంటర్ టైన్ మెంట్ పై ఎక్కువ శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ కోసం స్క్రిప్ట్ విషయంలో ప్రముఖులతో ఆయన చర్చలు జరిపాడు. బెల్లంకొండను ఈసారి చాలా విభిన్నంగా కామెడీ యాంగిల్ లో చూపించాలని దర్శకుడి అభిప్రాయం.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమాను వచ్చే నెల నుండి పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి సంక్రాంతి వరకు సినిమాను విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ విషయంలో కొన్ని ఆంక్షలు పాటించాల్సి ఉంది. ఆ కారణంగా కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది.