సోలోగా బెటరంటూ.. ఏమిటా చిలిపి పనులు బెదరూ?

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరులోంచి `ధరమ్`ని తొలగించాక అంతా ఊహించని మార్పు కనిపిస్తోంది. సాయి తేజ్ గా షార్ట్ కట్ లో మిరాకిల్స్ చేస్తున్నాడు. చిత్రలహరి.. ప్రతి రోజూ పండగే చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. తదుపరి సోలో బ్రతుకే సో బెటర్ అంటూ వస్తున్నాడు.

నిన్నగాక మొన్న పెళ్లాడేస్తున్నా! అంటూ పబ్లిసిటీ స్టంట్ కి తెర తీసాడు. దీంతో టాలీవుడ్ లో మరో వికెట్ అర్థాంతరంగా నేలకూలుతోందని అభిమానులు కలతకు గురయ్యారు. బ్యాచిలర్స్ హెడ్ ప్రభాస్ కే సారీ చెప్పడంతో మరింతగా కుంగిపోయారు. ఏదైతేనేం.. అదంతా డమ్మీనే అని తేలింది.

సరే కానీ.. తాజాగా సోలో బ్రదర్ చిలిపి వేషం ఒకటి బయటపడింది. సోలో బ్రతుకే సో బెటర్ అంటూనే ఎవరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు తేజ్ అలియాస్ విరాట్. “అంత స్ట్రిక్ట్గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృతని చూసాక ఏమైంది ??? “ అని ట్యాగ్ చేస్తూ తన తాజా సినిమా `సోలో బ్రతుకే సో బెటర్` నుంచి `హే.. ఇది నేనేనా` సాంగ్ విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ పాటను ఆగష్టు 26 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. సోలో కుర్రాడు ఇలా అమ్మాయికి పడిపోవడం ఏమిటో? ఇది బ్యాచిలర్ సంఘానికే అవమానం బ్రదర్!