అప్పటికింకా నా వయసు నిండా పదిహేడే!

0

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా `లీన్ .. మీన్ అండ్ ఆల్ 17` అన్న క్యాప్షన్ తో ఆమె 17 ప్రాయం త్రోబ్యాక్ ఫోటోను పంచుకోగా అది సునామీ వేగంతో సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా టీనేజీ జ్ఞాపకాల్లోకి ప్రయాణించింది. 38 ఏళ్ల ఈ అందాల నటి తన త్రోబాక్ ట్రెజరీ నుండి ఒక స్నిప్పెట్ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది మరియు. ఇది నిజమైన అమూల్యమైన జ్ఞాపకం. “లీన్.. మీన్ ఆల్ 17“ అంటూ ప్రియాంక తనను తాను వర్ణించుకుంది. # అన్ఫినిష్డ్ అనే హ్యాష్ట్యాగ్తో పాటు క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటో తీసిన ఏడాది తర్వాత ప్రియాంక 2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. 18 సంవత్సరాల వయస్సులో భారతదేశం నుండి 5 వ మిస్ వరల్డ్ గా విక్టరీ సాధించింది. ప్రియాంక తోటి మిస్ ఇండియా విజేతలు లారా దత్తా ..దియా మీర్జా తాజా ఫోటోపై వ్యాఖ్యను జోడించారు. “నాకు ఈ అమ్మాయి గుర్తు“ అన్న వ్యాఖ్యను జోడించి ఆనందం వ్యక్తం చేశారు.

2018లోనే ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోగా లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటం.. దియా మీర్జా మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ గెలిచిన మూడేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పైతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది.

పీసీ కి `అగ్నిపథ్` సహనటుడు హృతిక్ రోషన్ `స్వీటీ` అంటూ వ్యాఖ్యానించగా.. `ది వైట్ టైగర్` కొలీగ్ రాజ్ కుమార్ రావ్ రెడ్ ఈమోజీ హృదయాలను పోస్ట్ చేశారు. ప్రియాంక చోప్రా త్రోబాక్ ఫోటోల అభిమాని. తరచూ తన ఇన్ స్టాగ్రామ్ ను ఇలాంటి జ్ఞాపకాలతో నింపుతుంది. ఇంతకుముందు భర్త నిక్ జోనాస్ తో 11 మంది పిల్లల్ని కనాలనుందని విధి ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని పీసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసినదే.