గత వారం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నాడు ఆ కారణంగా బిగ్ బాస్ ఈ వీకెండ్ ఎపిసోడ్ కు రమ్యకృష్ణ మళ్లీ హోస్టింగ్ చేసేందుకు వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. శనివారం ప్రోమో విడుదల అయ్యే వరకు అంతా కూడా గెస్ట్ హోస్ట్ గురించి చర్చించుకున్నారు. ఇక నిన్నటి నుండి కూడా మళ్లీ వార్తలు షికారు చేశారు. ఈసారి నాగార్జున మనాలిలో ఉన్నాడు కనుక ఆయన స్థానంలో రోజా హోస్ట్ గా బిగ్ బాస్ ను ఈ వీకెండ్ నడిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. నిన్న నేడు ఆ విషయమై విపరీతంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు వెబ్ మీడియాలు కూడా ఆ విషయాన్ని కవర్ చేశాయి. స్టార్ మా వర్గాల వారు కూడా అధికారికంగా ఆ వార్తలను కొట్టి పడేయక పోవడంతో రెండు రోజులు ఆ వార్తలు జోరుగా వచ్చాయి.
తీరా నేడు మద్యాహ్నం తర్వాత వచ్చిన నేటి ఎపిసోడ్ ప్రోమో చూసి అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. నాగార్జున హోస్ట్ గానే వచ్చాడు. పుకార్లన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. నేటి ఎపిసోడ్ లో రాజశేఖర్ మాస్టర్ కు అరగుండు డీల్ చేశాడు. వచ్చే వారం నామినేషన్ నుండి సేఫ్ అయ్యేందుకు గాను అమ్మ రాజశేఖర్ ఏకంగా అరగుండు కొట్టించుకున్నాడు. నాగార్జున కనిపించడంతో మళ్లీ షో గురించి వచ్చిన వార్తలు అన్ని కూడా ఒట్టిదే అని క్లారిటీ వచ్చేసింది. వచ్చే వారం నిజంగానే నాగార్జున రాకున్నా కూడా ప్రేక్షకులు నమ్మక పోవచ్చు. గత ఏడాది ఒక్క వారం గెస్ట్ హోస్ట్ వచ్చినందుకు ఈ సీజన్ లో కూడా ఖచ్చితంగా గెస్ట్ హోస్ట్ వస్తారంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. సీజన్ పూర్తి అయ్యే వరకు ఒక్క వారం అయినా గెస్ట్ హోస్ట్ వస్తుందేమో చూడాలి.
Next nomination nundi safe avataniki #Nagarjuna deal accept chesina #AmmaRajasekhar#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/eStHUNbMsF
— starmaa (@StarMaa) October 17, 2020
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
