యాంకర్ ప్రదీప్ వెడ్స్ యాంకర్ శ్రీముఖి.. శుభలేఖ కూడా రెడీ..!

0

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి త్వరలోనే అంటూ ఈ మధ్య మీడియా సోషల్ మీడియా కోడై కూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చి. ప్రదీప్ కి చిలసౌ. శ్రీముఖి రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే యంగ్ యాంకర్స్ ప్రదీప్ – శ్రీముఖి ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనుకుంటే పొరపాటే. ఇది వాళ్లిద్దరూ చేసుకుంటున్న నిజమైన పెళ్లి కాదు.. బుల్లితెరపై సెలబ్రేట్ చేసే ఉత్తిత్తి పెళ్లి. ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి టీవీ ఛానల్స్ పోటీపడి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. వాటికి రేటింగ్స్ కూడా అదే స్థాయిలో ఉండటంతో ఇప్పుడు ప్రతి ఛానల్ పండుగ వస్తుందంటే చాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రెడీ చేస్తున్నారు. రాబోయే దసరా కి కూడా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ సిద్ధమయ్యాయి.

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగు యాంకర్ ప్రదీప్ – యాంకర్ శ్రీముఖి లతో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. ఈ మధ్య అటు ప్రదీప్ ఇటు శ్రీముఖి పెళ్లి వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రదీప్ – శ్రీముఖి ల పెళ్లి థీమ్ ని తీసుకొని దసరా పండుగకు స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ‘చి. ప్రదీప్ కి చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది..’ అంటూ ఓ శుభలేఖ ని చూపించారు. అంతేకాకుండా ”ఈ లేఖలో ఏముందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి దసరా స్పెషల్ ఈవెంట్” అంటూ ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించారు. ఇదిలా ఉండగా ప్రదీప్ మాచిరాజు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారాడు. మరోవైపు ‘బిగ్ బాస్’ షో ద్వారా భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా సినిమాల్లో కీలమైన పాత్రల్లో నటిస్తోంది.

ప్రదీప్ & శ్రీముఖి in చి|| ప్రదీప్ కి చి|| ల|| సౌ|| శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది a #DussehraSpecialEvent ✨
సరికొత్త వినోదంతో మీ జీ తెలుగు త్వరలో వస్తోంది …