రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ‘ఖిలాడీ’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే దసరా వరకు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి మొదటి హీరోయిన్ ను అనధికారింగా కన్ఫర్మ్ చేశారు.
దర్శకుడు రమేష్ వర్మ ఇటీవలే నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమె ఇప్పటికే రెండు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. రవితేజకు మంచి జోడీ అనుకోవడంతో పాటు ఈమె వల్ల సినిమా వెయిట్ పెరుగుతుందనే అభిప్రాయంతో ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా కోసం మరో హీరోయిన్ గా కేథరిన్ తెర్సాను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని ఆమెను కేవలం ఐటెం సాంగ్ కోసమే ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. క్రాక్ సినిమా షూటింగ్ ను మరి కొన్ని రోజుల్లో పూర్తి చేయబోతున్న రవితేజ వెంటనే ఖిలాడీ సినిమాను చేయబోతున్నాడు.