చిన్నన్న ఇల్లు కట్టించకుంటే వెళ్లి అడుగుతాః గంగవ్వ

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రత్యేకంగా నిలిచిన గంగవ్వ 5 వారాల పాటు ఉంది. ఆమె ఆరోగ్యం సహకరించక పోవడంతో వెళ్లి పోవాలని కోరుకుంది. ఆమె కోరుకున్నట్లుగానే బయటకు పంపించారు. కేవలం డబ్బు కోసమే నేను హౌస్ లోకి వచ్చాను అంటూ పలు సార్లు చెప్పిన గంగవ్వ ఆ డబ్బుతో ఇల్లు కట్టుకుంటాను అంది. ఇటీవల గంగవ్వ బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మండ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలను గురించి మాట్లాడింది. ముఖ్యంగా ఆమె పారితోషికం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

వారానికి రెండు లక్షల చొప్పున బిగ్ బాస్ టీం నాకు పారితోషికంగా ఇచ్చింది. మొత్తం పది లక్షలు చెల్లించారు. ఆ డబ్బుతో ఇల్లు పూర్తి అవ్వదు. నాగార్జున గారు ఇల్లు కట్టి ఇస్తానంటూ హామీ ఇచ్చారు కనుక ఆయన వద్దకు వెళ్లి ఒకసారి అడగాలని భావిస్తున్నట్లుగా చెప్పింది. ఇల్లు కట్టుకుని కొన్ని డబ్బులు దాచుకుని కొన్ని డబ్బులతో బంగారం కొనుక్కోవాలనేది నా కోరిక అంటూ గంగవ్వ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ తో బాగానే పాపులారిటీ ని గంగవ్వ దక్కించుకుంది. ఆ పాపులారిటీతో అంతో ఇంతో డబ్బు సంపాదిస్తుంది. కాని ఇంటి నిర్మాణం కోసం మాత్రం నాగార్జున గారే సాయం చేయాలంటూ గంగవ్వ విజ్ఞప్తి చేస్తుంది. చిన్నన్న నాగార్జున సాయం చేయకుంటే ఇంటికి వెళ్లి నిలదీస్తానంటూ నవ్వుకుంటూ కామెంట్ చేసింది. మరి నాగార్జున గారు ఈ విషయమై పట్టించుకుంటారా అనేది చూడాలి. గంగవ్వ కు ఇళ్లు కట్టిస్తే నాగార్జున మంచితనంకు అంతా కూడా హ్యాట్సాఫ్ అంటారు.