దివితో పెళ్లి.. హారికతో డేటింగ్ : మెహబూబ్

0

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్లు వారం పది రోజుల పాటు క్షణం తీరిక లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఈమద్య పెయిడ్ ఇంటర్వ్యూలు ఉంటున్న కారణంగా ఇదో తరహా ఆదాయం అన్నట్లుగా కొందరు ఇంటర్వ్యూలకు ఆసక్తి చూపిస్తున్నారు. మెహబూబ్ ఆదివారం బయటకు వచ్చినా ఎక్కువగా ఇంటర్వ్యూల్లో కనిపించలేదు. ఆ బాధ నుండి తేరుకున్నట్లుగా లేడు. అందుకే కాస్త ఆలస్యంగా ఆయన మీడియాలో కనిపిస్తున్నాడు. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెహబూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇంటి సభ్యులందరిపై చాలా పాజిటివ్ గా స్పందించాడు. ఇక అమ్మాయిలపై తనకు క్రష్ ఉన్న విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు. ఇన్ని రోజులు తనకు జోడీ లేదని లో లోపల బాధ పడ్డట్లుగా తాజాగా అతడి మాటలతో అర్థం అవుతుంది. ఇంట్లో ఉన్న అమ్మాయిలతో పెళ్లి.. డేటింగ్.. చంపడంను ఎవరిని ఎంపిక చేసుకుంటారు అంటూ అడిగిన ఆసక్తికర ప్రశ్నకు అందమైన దివితో పెళ్లి కోరుకుంటాను.. యాక్టివ్ గా ఉండే హారికతో డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటాను. రాక్షసి అయిన అరియానాను చంపేయాలనుకుంటాను అంటూ సమాధానం చెప్పాడు.

ఇక ఇంట్లో తనకు పెద్దన్న తరహాలో అభిజిత్ వ్యవహరించాడు. తనకు ఎన్నో సార్లు వెన్ను దన్నుగా నిలిచి నాకు మోటివేషన్ ఇచ్చాడు. టాస్క్ ల్లో ఆయన చేయి సరిగా లేకపోవడం వల్ల సరిగా ఆడటం లేదు కాని అభిజిత్ చాలా మంచి ఫైటర్ అంటూ మెహబూబ్ కితాబిచ్చాడు. ఇక సోహెల్ అన్నింటికి అర్హుడు అంటూ పేర్కొన్నాడు. టాప్ 3 లో సోహెల్ ఉంటాడని నమ్మకంగా చెప్పాడు. ఇక మరో రెండు మూడు వారాలు ఉంటే బాగుండేదనిపించింది అంటూ మెహబూబ్ మరోసారి ఎమోషన్ అయ్యాడు.