విన్నర్ అయ్యేందుకు అభిజిత్ కు మరో ఓటు పడింది

0

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అంటూ ఎంత బలంగా ప్రచారం జరిగిందో ఇప్పుడు అంతగా కాకున్నా ఒక మోస్తరుగా అభిజిత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యధిక సోషల్ మీడియా క్రేజ్ ఉన్న వ్యక్తి అభిజిత్. అందుకే అభిజిత్ విన్నర్ అవుతాడు అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. కౌశల్ ఇటీవల తన వీడియోలో అభిజిత్ కు విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విశ్లేషించాడు. ఇంకా చాలా మంది కూడా అభిజిత్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఆయన బలం మరింతగా పెరిగినట్లయ్యింది.

ఎంతో మంది ఆయన వైపు ఉంటే మనం మాత్రం వేరే ఎందుకు ఉండాలి అన్నట్లుగా న్యూట్రల్ గా ఉన్న వారు అభిజిత్ వైపు వెళ్తున్నారు. తాజాగా అభిజిత్ వెయిట్ మరింత పెరిగేలా నాగార్జున భార్య అయిన అమల అక్కినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అభిజిత్ తల్లిగా అమలా అక్కినేని నటించిన విషయం తెల్సిందే. అప్పటి విషయాలను ఆమె గుర్తు చేసుకోవడంతో అభిజిత్ కు సంబంధించిన గ్రాఫ్ మరింతగా పెరిగింది.

అభిజిత్ చాలా సౌమ్యుడు.. పెద్దల పట్ల గౌరవం ఉన్న కుర్రాడు. నా కొడుకులాగా అభిజిత్ ను భావిస్తాను షూటింగ్ సమయంలో అభిజిత్ నన్ను తన తల్లి మాదిరిగా గౌరవించేవాడు అంటూ అమలా చెప్పుకొచ్చారు. అమలా చాలా పాజిటివ్ గా అభిజిత్ గురించి మాట్లాడటంతో అతడి మరింత పెరిగింది. అతడి అభిమానులు సోషల్ మీడియాలో అమలా మాటలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ మరింత మందిని అభిజిత్ అభిమానుల క్లబ్ లో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరో మూడు వారాలు ఉన్న బిగ్ బాస్ విజేత ఎవరు అనే స్పష్టత అయితే వచ్చినట్లుగా అనిపిస్తుంది. కాని బిగ్ బాస్ లో ఏమైనా జరగవచ్చు. జనాల ఓట్ల ప్రకారమే అన్ని జరగవు అని గతంలో అనధికారికంగా నిరూపితం అయ్యింది. కనుక అభిజిత్ విజేత అయ్యేనా లేదా అనేది చివరి రోజు వరకు నూరు శాతం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.