Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి4 : గంగవ్వ వల్ల గేమ్ చెడిపోతుందా

బిబి4 : గంగవ్వ వల్ల గేమ్ చెడిపోతుందా


ఇప్పటి వరకు ఏ భాష బిగ్ బాస్ సీజన్ లో కూడా కనిపించని సంఘటన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగింది. ఆరు పదుల వయసు ఉన్న ఒక పల్లెటూరు చదువుకోని గంగవ్వను హౌస్ లోకి పంపించడం అతి పెద్ద ప్రయోగంగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఇప్పటి వరకు జరగలేదు.. ఇకపై కూడా జరిగే అవకాశం లేదు అంటున్నారు. యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఇక ఆమె బిగ్ బాస్ కు వెళ్లింది అంటే జనాలు మొత్తం ఆమె వెనుక ఉన్నారు. మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో భారీగా ఓట్లు పడ్డట్లుగా తెలుస్తోంది.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అయిదు కోట్లకు పైగా ఓట్లు నమోదు అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. అందులో దాదాపుగా సగం ఓట్లు గంగవ్వకు వచ్చాయి అనేది అందరు అనుకుంటున్న మాట. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు గంగవ్వ గురించి తెలియని వాళ్లు కూడా ఒక పల్లెటూరుకు చెందిన గంగవ్వ అంత గుర్తింపు దక్కించుకుని బిగ్ బాస్ కు వెళ్లడం అంటే గొప్ప విషయం అంటూ ఆమెకు ఓట్లు వేస్తున్నారు. గంగవ్వ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే అన్నాళ్లు ఉంచాలని బిగ్ బాస్ భావిస్తున్నాడు. ఆమె మాత్రం ఎక్కువ కాలం ఉండేలా లేదని ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది.

ఆమె ఎన్నాళ్లు ఉన్నా కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ గా షో సాగుతుందని కొందరు బలంగా నమ్ముతుంటే మరికొందరు మాత్రం ఆమె వల్ల షో ఫార్మెట్ చెడిపోతుందేమో అంటున్నారు. బిగ్ బాస్ అంటేనే టాస్క్ లు. ఆ టాస్క్ లను గంగవ్వ చేయడం సాధ్యం కాదు. కనుక ఆమె టాస్క్ ల సమయంలో పక్కకు ఉండాల్సిందే. అలాంటప్పుడు ఆమెకు ఎక్కువ ప్రాముఖ్యత ఇతర కంటెస్టెంట్స్ కు తక్కువ ప్రాముఖ్యత అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల ఇతర కంటెస్టెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ఆమెపై చిన్న వ్యాఖ్య చేసినా కూడా వారికి బయట చుక్కలు చూపించేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. కనుక ఆమె గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ మొత్తం వ్యవహారం కారణంగా షో కాస్త డిస్ట్రబ్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.