Templates by BIGtheme NET
Home >> Cinema News >> గీతా ఆర్ట్స్ దూకుడు ఈ రేంజ్ లోనా..!

గీతా ఆర్ట్స్ దూకుడు ఈ రేంజ్ లోనా..!


గీతా ఆర్ట్స్ మళ్లీ వరుస సినిమాలతో దూకుడు ప్రారంభించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ సినిమాలు చేసిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 అని ఒక పెట్టి బన్నీ వాసుని నిర్మాతగా చేసి మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. కమర్షియల్ లెక్కల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేకపోయినా బడ్జెట్ విషయంలో ఆ తేడాలు కచ్చితంగా ఉంటాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ 2 నుంచి లో, మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు.

స్టార్స్ తో పెద్ద బడ్జెట్ తో సినిమాలు ప్లానింగ్ లో ఉన్నా వాటికి టైం పట్టేలా ఉంది. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ నుంచి త్వరలో రెండు కొత్త సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 9న సెట్స్ మీదకు వెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది. గుజరాతి కథ ఆధారణంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి.

ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటుగా రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాను కూడా గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో హీరో ఎవరన్నది తెలియదు కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. సినిమాతో రష్మిక సర్ ప్రైజ్ చేసేందుకు రెడీగా ఉంది.

ఈ రెండు సినిమాలను ఒకేరోజు సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు మేకర్స్. రెండు డిఫరెంట్ కథలు అవ్వడం రెండిటికీ టీం ఆల్రెడీ మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించడం ఎవరి పనులు వారు చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలతో గీతా ఆర్ట్స్ మరోసారి బ్యానర్ సత్తా చాటాలని చూస్తున్నారు. నాగ చైతన్య చందు మొండేటి సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉండబోతుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమాలతో గీతా ఆర్ట్స్ మరోసారి ఇండస్ట్రీలో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల నిర్మాణంలో బన్నీ వాసు చాలా ఫోకస్ గా ఉన్నారని తెలుస్తుంది. గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా డిఫరెంట్ కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత రాహుల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.