ఇది ఎంత మంది చూస్తారు : గీతా

0

టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడెం యువతి 139 మంది రేపు కేసు అనూహ్య మలుపు తిరిగింది. యాంకర్ ప్రదీప్ తో పాటు మరికొందరి పేర్లను డాలర్ బాబు బలవంతంతో చెప్పానంటూ ఆమె వెళ్లడించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ ఉన్నాడు అంటూ వార్త వచ్చిన వెంటనే దావానంలో వ్యాప్తి చెందాయి. ప్రదీప్ ఆ విషయంలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ప్రదీప్ అన్నట్లుగానే ఈ కేసు నుండి నిర్దోషిగా బయట పడ్డాడు. ప్రదీప్ కు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మళ్లీ యూట్యూబ్ ఛానెల్స్ ప్రదీప్ అమాయకుడు అంటూ థమ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు. గీతా మాదురి ఈ విషయమై స్పందిస్తూ ఆ యువతి ప్రదీప్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పిన ఒక వీడియో థమ్ నెయిల్ షేర్ చేసి దాన్ని చూసినంత మంది ఈ వీడియోను చూస్తారా.

ఈ వీడియోను ఎంత మంది చూస్తారు అంటూ సోషల్ మీడియాలో పెట్టింది. సత్యం గెలుస్తుంది. అయితే అప్పటి వరకు ఓపిక ఉండాలంటూ ఆమె సూచించింది. ఏదైనా పుకారు వచ్చిన వెంటనే ఆలోచించకుండా హడావుడిగా ప్రచారం చేయవద్దు అనేది ఆమె ఉద్దేశ్యం. ప్రదీప్ కు ఆ కేసుతో సంబంధం ఉందనే వార్త చదివిన ప్రతి ఒక్కరు ఈ వార్తను చదివేనా అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది.