ఆ ఫ్యామిలీలోని స్టార్ హీరోలకు పడటం లేదా…?

0

టాలీవుడ్ ని ఏలుతున్న ఓ ఫ్యామిలీలోని ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరిందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గత కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోలు పరిచయం అవుతూ వస్తున్నారు. అయితే ఒకే ఫ్యామిలీ హీరోలైనప్పటికీ వారి ఫ్యాన్స్ వర్గంలో మాత్రం మొదటి నుంచీ చీలికలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీలో ఒక హీరో ఇండస్ట్రీకి ఎవరి వల్ల వచ్చాడో మర్చిపోయాడని.. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సొంత పేరుతో పైకొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరు ఫ్యామిలీ హీరోల మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తోంది.

కాగా ఇటీవల అనుకోకుండా ఒక హీరో మంచి విజయాన్ని అందుకున్నాడు. దీన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ఫ్యామిలీలోని ఇతర హీరోలను తక్కువ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్స్ పెట్టారట. దీంతో అదే ఫ్యామిలీలోని మరో హీరోకి కోపం తెప్పించడంతో పాటు సదరు హీరో కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని భావించాడట. ఇప్పటికే ఫ్యాన్స్ వర్గంలో చీలక చేసిన ఆ హీరో తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ చేసుకోవడం వంటి విషయాలు పై చాలా రోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధాలు.. కవ్వింపులు చర్యలు జరుగుతూ వచ్చాయని సమాచారం.

ఈ నేపథ్యంలో ఓన్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన హీరో ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఇది ఇంకో హీరోకి చాలా కోపాన్ని తెప్పించిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల ఓ ఫ్యామిలీ మీటింగ్ కి ఇద్దరు రాకపోవడాన్ని గల కారణాలు ఏంటని పెద్దలు ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయట. ఎప్పటినుంచో నలుగుతున్న ఈ కోల్డ్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరడంతో ఈ పంచాయతీ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ లో బీజం వేసిన పెద్దాయన దగ్గరకు వెళ్లబోతుందని ఆ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండేవారు చెప్తున్నారు. మరి ఈ ఇద్దరు ఫ్యామిలీ హీరోల మధ్య తగువు ఎంత వరుకు వెళ్తుందో చూడాలి.