ఈ ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్లు బాలయ్యా…!

0

తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి పేరు నిలబెడుతూ వచ్చాడు. ఆ తర్వాత జెనరేషన్ లో ఈ ఫ్యామిలీ నుండి తారకరత్న – కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ లు టాలీవుడ్ కి హీరోలుగా పరిచమయ్యారు. అయితే తారకరత్న – కళ్యాణ్ రామ్ కు మాత్రం ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకోలేకపోయారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ ఒకప్పుడు ఒక హిట్టూ నాలుగు ప్లాపులుగా కొనసాగింది. కానీ ఈ మధ్య మాత్రం ఆచితూచి కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఎన్ని హిట్స్ వచ్చినా ఇంతవరకు ఒక్క బ్రేక్ ఈవెన్ కూడా లేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నందమూరి వారసులు నట వారసత్వాన్ని కొనసాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

కాగా నందమూరి వారసుల్లో ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస విజయాలు అందుకుంటూ నందమూరి లెగసీని కాపాడతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఒకానొక దశలో బాలయ్య వరుస ప్లాపులలో కురుకుపోయినప్పుడు నందమూరి లెగసీని కాపాడింది కూడా ఎన్టీఆర్ అని చాలా మంది నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కానీ బాలయ్యకు మాత్రం ఇండస్ట్రీలో తారక్ నందమూరి ఫ్యామిలీని లీడ్ చేయడం ఇష్టం లేదేమో అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే అని ఇటీవల బాలయ్య కామెంట్స్ చేయడమే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం మాత్రం లేట్ అవుతూ వస్తోంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే షష్టిపూర్తి చేసుకున్నారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలోని మిగతా సూపర్ సీనియర్ హీరోల వారసులంతా నెక్ట్ జెన్ రేషన్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కానీ బాలయ్య మాత్రం తన నటవారసత్వం ఎవరికి ఇవ్వాలనే డైలామాలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.