పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మోషన్ పోస్టర్ లో అంబేద్కర్ మరియు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఫొటోలో మధ్యలో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో చైర్ మీద ఒక కాలు పెట్టి ఠీవీగా నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో క్రిమినల్ లా మరో చేతిలో క్రిమినల్స్ ని దండించడానికి అన్నట్టు బేస్ బాల్ స్టిక్ పట్టుకొని సీరియస్ లుక్ లో ఉన్నాడు. మోషన్ పోస్టర్ నేపథ్యం చూస్తుంటే ఇది ఫైట్ కి సంబంధించిందని అర్థం అవుతోంది. ఈ మోషన్ పోస్టర్ కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన ‘సత్యమేవ జయతే..’ అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించిన పోస్టర్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కాగా “వకీల్ సాబ్” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు – శిరీష్ మరియు బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ – శ్రుతి హాసన్ – నివేదా థామస్ – అంజలి – అనన్యలు ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్ సాబ్’ కరోనా వైరస్ పరిస్థితుల వలన నిలిచిపోయింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ కోసం అభిమానులు చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.