సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

0

తమిళ స్టార్ హీరో సూర్య సూరారై పోట్రూ ఇటీవలే అమెజాన్ ద్వారా తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాను ఓటీటీలో చూడాల్సి వచ్చినందుకు బాధగా ఉందంటూ చాలా మంది సూర్య అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమాను ఓటీటీలో విడుదల చేసి సూర్య చాలా పెద్ద తప్పు చేశాడని.. దీనిని కనుక థియేటర్లలో విడుదల చేస్తే ఖచ్చితంగా ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచేది అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ థ్రిల్ ను మిస్ అయిన సూర్య అభిమానులకు వచ్చే నెలలో అది దక్కే అవకాశం కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు మరియు తమిళంలో లిమిటెడ్ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను అమెజాన్ తో ఒప్పందం కుదిరిందట. థియేటర్ల యాజమాన్యాలు కూడా ఈ సినిమాను స్క్రీనింగ్ కు ఒప్పుకున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి సినిమాలను థియేటర్లలో వేస్తేనే జనాలు మళ్లీ థియేటర్లకు అలవాటు పడుతారు. అందుకే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఓటీటీలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేయమని ఆమద్య థియేటర్ల యాజమాన్యం హెచ్చరించింది. కాని ఇప్పుడు వారి మాటను వెనక్కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో సూర్య అభిమానులు ఆకాశమే నీ హద్దురా ను థియేటర్లలో చూసే అవకాశం ఉంది.