బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్ లో ఎలాంటి మార్పులు చేయనున్నారు..?

0

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ‘అల్లుడు శ్రీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్.. మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలో బెల్లంకొండ నార్త్ ఆడియన్స్ లో కూడా స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు.’అల్లుడు శ్రీను’ ‘స్పీడున్నోడు’ ‘సీత’ ‘జయ జానకీ నాయక’ ‘కవచం’ ‘సాక్ష్యం’ చిత్రాలు హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో మిలీయన్ల కొలదీ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ విధంగా బాలీవుడ్లోనూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో రీమేక్ తో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. 15 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుజిత్ – లింగుస్వామి – ప్రభుదేవా వంటి దర్శకులని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ ని అనుకుంటున్నారాట. అంతేకాకుండా ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ స్క్రిప్ లో పలు మార్పులు చేస్తున్నాడట. నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగులో ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు.