వావ్ ప్రణీత సూపర్ హీరో యాక్ట్

0

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రణీత అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు కెరీర్ టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో జోరు అందుకోలేదు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత అయినా ఈమె బిజీ అవుతుంది అనుకుంటే మేకర్స్ ఆమెను పట్టించుకోలేదు. ఈ అమ్మడు అడపా దడపా అవకాశాలు వస్తుండటంతో ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకున్నా కన్నడంలో ఈమె బిజీ అయ్యింది. హిందీలో కూడా ఈమె నటిస్తోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

నీటిలో డైవ్ చేసి వాటర్ వెయికిల్ తో అండర్ వాటర్ లో ప్రయాణించింది. ఆ సమయంలో ఆమె ఆక్సీజన్ మాస్క్ కాని ఇతర సెక్యూరిటీ సంబంధించినవి ఏమీ లేకుండానే ముందుకు సాగింది. ఆమె అండర్ వాటర్ ప్రయాణం సూపర్ హీరో సినిమాలో హీరోల మాదిరిగా అనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోలు సైతం బాబోయ్ అంటూ భయపడే ఈ యాక్ట్ చేసినందుకు మీరు నిజంగా అభినందనీయులు అంటూ నెటిజన్స్ మరియు ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. నిజంగా ఇలాంటి ప్రయాణం చేసి మేమేం తక్కువ కాదు అంటూ ఆడవారి సాహసాలను ఈమె జనాల ముందుకు తీసుకు వచ్చింది.