వర్కౌట్స్ చేస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి చూద్దాం…!

0

కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ లేకపోవడంతో హీరోలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే లైఫ్ లో అనుకోకుండా దొరికిన ఆ సమయాన్ని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ క్వారంటైన్ టైంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా లాక్ డౌన్ లో రవితేజ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక సినిమాలు లేవని ఫిట్నెస్ ని అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ ని మైంటైన్ చేస్తున్నారు రవితేజ. ఈ వయసులోనూ కండలు తిరిగిన దేహంతో రవితేజ.. యువ హీరోలకు పోటీ ఇచ్చేలా తయారయ్యాడు. ఇప్పటికే తన వర్కౌట్ ఫోటోలు.. జిమ్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన మాస్ మహారాజా.. తాజాగా ‘క్రష్ ది చీట్ డే’ అంటూ మరో వర్కౌట్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అంతేకాకుండా తన జిమ్ లో దిగిన ఓ స్నాప్ ని స్టోరీగా పెట్టాడు. అయితే ఈ ఫొటోలో రవితేజ రెండు చేతులతో డంబెల్స్ పట్టుకొని తన ఫేస్ కనిపించకుండా ముసుగేసుకుని ఉన్నాడు. దీంతో ఈ ఫొటోలో కనిపిస్తున్న మాస్ హీరో కనుక్కోండి చూద్దాం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు.

కాగా ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. తన కెరీర్లో 66వ చిత్రంగా వస్తున్న ‘క్రాక్’లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. శృతి హాసన్ – వరలక్ష్మి శరత్ కుమార్ – సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ‘క్రాక్’తో పాటు ‘రాక్షసుడు’ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు రవితేజ. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో యువ హీరో కోనేరు హవీష్ నిర్మించనున్నారు. అంతేకాకుండా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.