‘వండర్ ఉమెన్ 1984’ తెలుగు ట్రైలర్ రిలీజ్…!

0

2017లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వండర్ ఉమెన్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ ”వండర్ ఉమెన్ 1984”. గాల్ గాడట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రతిష్టాత్మకమైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. యాక్షన్ అండ్ ఎనర్జీతో నిండిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లో డయానా ప్రిన్స్(గాల్ గాడోట్) మరియు చిరుత (క్రిస్టిన్ వీగ్) ల మధ్య యుద్ధాన్ని చూపించారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సీక్వెల్ లో విపరీతమైన యాక్షన్ కనిపించబోతోందని.. గాల్ గాడట్ తన సూపర్ పవర్ తో మరిన్ని సాహసాలు చేసిందని స్పష్టమైంది.

కాగా అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన ‘వండర్ ఉమన్’ చిత్రాన్ని ఇండియాలో కూడా బాగా ఆదరించారు. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ ”వండర్ ఉమెన్ 1984” సినిమాని తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో నిర్మించారు. పాటీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ ని వార్నర్ బ్రదర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో వండర్ ఉమన్ గా గాళ్ గాడట్.. స్టీవ్ ట్రెవర్ పాత్రలో పైన్.. చిరుత పాత్రలో క్రిస్టిన్ విగ్ మరియు మాస్వెల్ లార్డ్ పాత్రలో పాస్కల్.. ఆంటియోప్ పాత్రలో రైట్ నటించారు. నిజానికి ఈ చిత్రం జూన్ 5న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న థియేటర్స్ లో ”వండర్ ఉమెన్ 1984” చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.