ప్రియుడిని ముద్దుల్లో ముంచేసిన జ్వాలా

0

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తమిళ నటుడు విష్ణు విశాల్ లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఆ విషయంను మాత్రం ఇటీవలే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇద్దరికి గతంలోనే వేరు వేరుగా పెళ్లిలు అయినా వేరు వేరు కారణాల వల్ల విడాకులు అయ్యాయి. వారి వారి జీవిత భాగస్వామితో విడిపోయిన తర్వాత వీరు మరింత దగ్గర అయ్యారు. ఇటీవలే గుత్తా జ్వాలా తమ ప్రేమ వ్యవహారంను బయట పెట్టేసింది. గత నెలలో తమ నిశ్చితార్థం జరిగిందని పెళ్లి త్వరలో జరుగబోతుందని చెప్పిన ఈ జంట ప్రస్తుతం లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని వారి సోషల్ మీడియా పోస్ట్ లను బట్టి అర్థం అవుతుంది.

రెగ్యులర్ గా వీళ్లు ఫొటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా గుత్తా జ్వాలా ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్ చేసింది. విష్ణు కు గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంది. నాకు పూర్తి స్థాయి జాయ్ నీతో ఉన్నప్పుడు ఉంటుంది. నాతో ఎవరు ఉంటే నేను సంతోషంగా ఉంటానో వారిలో నువ్వు ఒక్కడివి. నీవు నాకు జీవితాంతం తోడుగా ఉంటావని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది. గత జీవితాలను మర్చి పోయి ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని ఇప్పటికే ప్రారంభించారు. పెళ్లితో ఆ కొత్త జీవితం మరింతగా దృడం అవ్వబోతుంది. పెళ్లి తేదీపై త్వరలో క్లారిటీ ఇచ్చేఅవకాశం ఉంది.