మహేష్ టీంలో సగం మందికి పాజిటివ్!!

0

మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న ‘మేజర్’ ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. షూటింగ్ మొదలు పెట్టే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్ని ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ వచ్చారు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత సాదారణంగా యూనిట్ సభ్యులందరికి కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించారు. షూటింగ్ కు హాజరు అయిన ప్రతి ఒక్కరికి పరీక్ష నిర్వహించగా షాకింగ్ గా దాదాపుగా సగం మందికి పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.

అదృష్టం కొద్ది నమ్రత కాని మహేష్ కాని షూటింగ్ కు వెళ్లలేదు. దాంతో వారిద్దరికి ఎలాంటి ప్రమాదం లేదు. విషయం తెలిసి వెంటనే మహేష్ బాబు మొత్తం ‘మేజర్’ టీంను ఐసోలేషన్ కు వెళ్లి పోవాలంటూ సూచించారట. ఇప్పట్లో షూటింగ్ వద్దంటూ దర్శకుడికి చెప్పేశాడట. ప్రస్తుతం చిత్ర హీరో అడవి శేషు కూడా ఐసోలేషన్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఈ సంఘటనతో మహేష్ ఇప్పట్లో షూటింగ్ కు వెళ్లే ఆలోచనను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కనుక షూటింగ్ విషయంలో మహేష్ బాబు అస్సలు రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాడట.

మహేష్ బాబు ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రంకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా షూటింగ్ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభించాలనుకున్నారు. కాని షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. షూటింగ్ కు కొందరు సాహసం చేస్తుంటే మరికొందరు మాత్రం బాబోయ్ అంత రిస్క్ ఎందుకులే అనుకుంటున్నారు.