కింగ్ బర్త్ డేకి లవ్ స్టోరి నుంచి గిఫ్ట్ ఇదిగో

0

కింగ్ నాగార్జున గత ఏడాది షష్ఠి పూర్తి (60 ఏళ్లు) వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో గప్ చుప్ గా 60వ పుట్టినరోజు వేడుకలు పూర్తి చేసుకుని అక్కినేని కుటుంబం బ్యాక్ టు బిజీ లైఫ్ అంటూ తిరుగు విమానం ఎక్కింది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. నేడు (29 ఆగస్టు) కింగ్ 61వ బర్త్ డే.

కెరీర్ ఆద్యంతం రొమాంటిక్ హీరోగా నాగార్జునకు ఎనలేని గుర్తింపు ఉంది. అమ్మాయిల గుండెల్లో ఇప్పటికీ రాకుమారుడే. మరి ఆయన వారసులు `అక్కినేని రొమాంటిక్ హీరో` ట్యాగ్ ని మోస్తున్నారా? అంటే పెద్ద కుమారుడు నాగచైతన్యనే ఈ ప్రశ్న అడగాలి.

చైతూ తొలి నుంచి నాన్నగారినే అనుసరించాడు. ఏమాయ చేశావే లాంటి రొమాంటిక్ లవ్ స్టోరితో అతడి కెరీర్ మొదలైంది.. ప్రస్తుతం కమ్ముల దర్శకత్వంలో చేస్తున్నది `లవ్ స్టోరీ`నే. ఇంకా చాక్లెట్ బోయ్ లుక్ నుంచి చైతూ మారలేదు. కాబట్టి ఈ మూవీ అతడికి వర్కవుటవుతుందనే భావిస్తున్నారు. నాగార్జున తర్వాత టాలీవుడ్ లో రొమాన్స్ పరంగా కింగ్ అని నిరూపించేందుకు చైతూ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రతిసారీ ప్రేమకథల్ని.. శృంగార రసాత్మక కథాంశాల్ని ఎంచుకోవడం ద్వారా తన తండ్రి అడుగుజాడలను చైతూ అనుసరిస్తున్నాడనే భావించాలి. శేఖర్ కమ్ములతో `లవ్ స్టోరి` ఈ తరహానే. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ని నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ లో చైతూ – సాయి పల్లవి జంటను చూపించారు మరి. చూడముచ్చటైన జంట పక్క పక్కన కూర్చొని చూస్తుంటే ఎంతో ముద్దొచ్చేస్తున్నారు. ఒకరినొకరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని ఈ లుక్ చెబుతోంది. రొమాంటిక్ పోస్టర్ తో నాగ్ కు శుభాకాంక్షలు చెప్పిన విధానం ఆసక్తికరం. సందర్భోచితమే. లవ్ స్టోరి చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. సెప్టెంబర్ 7 నుండి షూటింగ్ ను ఆర్.ఎఫ్.సీలో తిరిగి ప్రారంభించనున్నారు.