ప్రభాస్ అభిమానులకు ఈ రోజంతా విజువల్ ఫెస్టివలే!

0

డార్లింగ్ ప్రభాస్ నటించిన బెస్ట్ సినిమాలేవీ? అవన్నీ ఒకేరోజులో వరుస పెట్టి చూసేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ ఫ్రీ ఫ్రీ… టీవీల్లో ఈ సినిమాలన్నీ ఉచితంగా చూసేయొచ్చు. అది కూడా ఈ ఆఫర్ ఈ ఒక్కరోజుకే ఉచితం. ఎందుకలా? అంటారా.. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఎందుకో బాగా తెలుసు. ఈరోజు ప్రభాస్ రాజు బర్త్ డే. నాలుగు పదులు క్రాస్ చేసి 41లో అడుగుపెట్టాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా వెలిగిపోతున్న ప్రభాస్ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఇయర్ కాలగర్భంలో కలిసిపోయింది. అయితేనేం అభిమానులు మాత్రం ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఆరు సినిమాలు వీక్షించేందుకు టీవీ చానెళ్లు అందుబాటులోకి తెచ్చాయి.

మిర్చి- బుజ్జిగాడు-చత్రపతి- బాహుబలి- మిస్టర్ పర్ఫెక్ట్ – వర్షం .. ఇవన్నీ వన్ బై వన్ వీక్షించే వెసులుబాటు ఉంది. టీవీ రిమోట్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో ఒక సీన్ ఈ సినిమాలో ఒక సీన్ .. మీకు నచ్చినవి కూడా చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నమాట. డార్లింగ్ బెస్ట్ యాక్షన్ సీన్స్ ని వీక్షించాలంటే అలా చేయక తప్పదు. స్టార్ మాలోనే నాలుగైదు సినిమాలు వేస్తున్నారు. అలాగే జెమినిలో వర్షం.. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాసిక్స్ ని వేస్తున్నారు. అభిమానులకు ఈరోజంతా పండగే పండగ.

ఈరోజు బర్త్ డే సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోస్లర్లు రిలీజవుతాయని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డార్లింగ్ అంతకుమించిన సర్ ప్రైజ్ ఇస్తాడేమో చూడాలి. అన్నట్టు జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి గురించి 41లోనూ ఇంకా చెప్పవా డార్లింగ్? అంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. మరి దానికి సమాధానం ఇస్తాడా?