బావా కుమ్మేశావ్..! గబ్బర్ సింగ్ హరీష్ ఉద్వేగం!!

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండదు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిపోవాల్సిందే. అలాంటి పవన్ రెండున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసి ఫస్ట్ లుక్ మగువ సాంగ్ సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. పవన్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఓ రేంజ్ లో వుంటుందని ఇప్పటికే టాక్ బయటికి వచ్చింది. దిల్ రాజు కూడా ఈ మూవీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ నెల 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలు జరగబోతున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ మూవీ పుంచి బిగ్ సర్ ప్రైజ్ని ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ని బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఈ సర్ ప్రైజ్ని రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని టీమ్ ఫిక్స్ చేసింది. దీనిపై హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తమన్ని ఉద్దేశిస్తూ `బావా కుమ్మేశావని న్యూస్ వచ్చింది. నా వల్లకాదు. ఆగలేకపోతున్నా` అని హారీష్ శంకర్ చేసిన ట్వీట్ టీజర్ పై అంచనాల్ని పెంచేస్తోంది.