‘బీ ఓపెన్.. బీ F**king రియల్’ అంటున్న కాజోల్ సిస్టర్…!

0

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ – టాలీవుడ్ – కోలీవుడ్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ సెక్సీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తనీషా ముఖర్జీ బికినీ అందాలతో అదరగొడుతూ ఉంటుంది. ఈమె కాజోల్ చెల్లిగానే కాకుండా.. హాట్ భామల జాబితాలో ఒకరిగా అందరూ గుర్తుపెట్టుకున్నారు. ‘ష్..’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన తనీషా ‘సర్కార్’ ‘సర్కార్ రాజ్’ ‘నీల్ నిక్కీ’ ‘టాంగో చార్లీ’ ‘వన్ టూ త్రీ’ ‘అన్నా’ చిత్రాల్లో నటించింది. ఇక దక్షిణాదిలో మొదట తమిళ చిత్రం ‘ఉన్నాలే ఉన్నాలే’ లో నటించింది. ఈ సినిమా తెలుగులో ‘నీ వల్లే నీ వల్లే’ అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘కంత్రి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత సౌత్ సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు.

కాగా తనీషా ముఖర్జీ సినిమాలతో కంటే హీట్ పుట్టించే ఫోటో షూట్స్ తో వివాదాలతో బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ నటుడు అర్మాన్ కోహ్లి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో అప్పట్లో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. వీరిద్దరూ కలిసి నగ్నంగా కెమెరాకు దొరికిపోవడం సంచలనం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఇలా ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తనీషా ముఖర్జీ మరో సారి వార్తల్లో నిలిచింది. ఇంస్టాగ్రామ్ లో అతేంటిక్ రూల్స్ పేరుతో ‘బీ ఓపెన్.. బీ F**king రియల్.. F**kology..’ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.