బాపు వర్ధంతి : వైరల్ అవుతున్న లెజెండ్స్ పాత ఫొటో

0

తెలుగు సినిమాపై తనదైన ముద్రను వేసిన బాపు గారి వర్దంతి ఆగస్టు 31. ఆయన మృతి చెంది ఆరు ఏళ్లు అయినా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు మరియు సినీ జనాలు ఉన్నారు అనడంలో సందేహం లేదు. రోజు ఏదో ఒక టీవీలో ఆయన సినిమానో లేదంటే ఆయన గీసిన బొమ్మనో వస్తూనే ఉంటుంది. ముళ్లపూడి వెంకటరమణ గారితో ఆయన కలిసి చేసిన సినిమాలు ఎన్నో నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు. బాపు రమణల సినిమా అంటూ అప్పట్లో చాలా ఈ జోడీ చాలా ఫేమస్ అయ్యింది. బాపు వర్ధంతి సందర్బంగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫొటోలో లెజెండ్స్ బాపు రమణ గార్లతో పాటు ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్.. మరో దర్శకుడు వంశీ ఇంకా మరి కొందరు కూడా ఉన్నారు. శుభోదయం వంశీ అంటూ బాపు గారి ఫాంట్ లో ఉన్న అక్షరాలు ఫొటోపై చూడవచ్చు. బాపు గారి జ్ఞాపకాల్లో ఇంకా సినీ ప్రముఖులు మరియు అభిమానులు ఉన్నారు అనేందుకు ఈ ఫొటో వైరల్ కావడం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. 1967లో సాక్షి అనే సినిమాతో పరిచయం అయిన బాపు గారు ఈతరం ప్రేక్షకుల కోసం కూడా పలు సినిమాలను తెరకెక్కించారు. ఆయన లేని లోటు మరువ లేనిది.