Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?

ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?


ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే కథానాయికలు కాస్త తడబడతారు. కానీ అందాల తాప్సీ పన్ను ఏమాత్రం సంకోచించకుండా తనతో నటించిన హీరోలనే భయపెట్టేస్తూ తాను ఎంతో స్వేచ్ఛగా ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారట. తన స్పీడ్ చూసి అబ్బాయిలే భయపడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటే.. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన హసీనా దిల్ రుబా చిత్రంలో విక్రాంత్ మాస్సే – హర్షవర్ధన్ రాణే తాప్సీ తో నటించాలంటేనే భయపడ్డారని కథనాలొచ్చాయి. అయితే ఇదే విషయాన్ని విక్రాంత్ ని ప్రశ్నంచగా.. అతడు తాప్సీలోని చలాకీతనం గురించి ప్రశంసలు కురిపించాడు. తాప్సీ చాలా సంతోషకరమైన వ్యక్తి. ఆమె ఐదు నిమిషాలు కూడా నిశ్శబ్ధంగా ఉండదు. నిరంతరాయంగా మాట్లాడుతుంది. తాప్సీతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడానికి ఎవరూ భయపడలేదు. అందులో మేము నిపుణులమే.. కానీ తప్పుగా ప్రచారం జరిగింది.. అని తెలిపాడు. కొన్ని ప్రచురణలు సన్నిహిత సన్నివేశాల గురించి తాప్సీ వ్యాఖ్యలను తప్పుగా చూపించి సంచలనాత్మకంగా మార్చాయని విక్రాంత్ తెలిపారు.

హసీన్ దిల్ రుబా చిత్రం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతోంది. తాప్సీ కొన్ని బోల్డ్ సన్నివేశాలు సిగ్గు పడకుండా నటించేయడం అబ్బాయిల్లో చర్చకు వచ్చింది. హసీనా దిల్ రుబాలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. విక్రాంత్ మాస్సే – హర్షవర్ధన్ రాణే ఇద్దరితో కొన్ని సన్నిహిత సన్నివేశాలలో తాప్సీ నటించింది.

దీని గురించి మాట్లాడుతూ సన్నిహిత సన్నివేశాలు చేయడం చాలా అసౌకర్యంగా ఉందని… సన్నివేశాలు సరిగ్గా రాకపోవటం చాలా రీటేక్ లు జరుగుతున్నందున ఇది ఆమెతో సరిగ్గా జరగలేదని హర్షవర్ధన్ రాణే అన్నారు. తనతో రాణే చాలా సన్నిహితంగా నటించాల్సి వచ్చింది. సందిగ్ధతతో ఉంటే దర్శకుడు జోక్యం చేసుకున్న తర్వాతే సన్నివేశాలు సజావుగా పూర్తయ్యాయి. సాధారణంగా అలాంటి సన్నివేశాల్లో అమ్మాయిలకు అసౌకర్యం కలుగుతుంది. కాని ఇక్కడ తాప్సీ అబ్బాయిలందరినీ కలవరపరిచేంత సౌకర్యంగా నటించేశారు.. అని ప్రశంసించాడు హర్షవర్ధన్ రాణే. మొత్తానికి తాప్సీ తన సీనియారిటీని ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేశారన్నమాట.