‘ఓదెల రైల్వేస్టేషన్’లో హెబ్బా పటేల్ డీ గ్లామర్ లుక్..!

0

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ ”ఓదెల రైల్వేస్టేషన్”. అశోక్ తేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంపత్ నంది స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఓదెల గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ – వశిష్ట సింహా – సాయిరోనక్ – పూజితా పొన్నాడ – నాగ మహేశ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ క్రమంలో నేడు దీపావళి పండుగను పురస్కరించుకుని ‘ఓదెల రైల్వేస్టేషన్’ నుంచి హెబ్బా పటేల్ క్యారక్టర్ ని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

‘ఓదెల రైల్వేస్టేషన్’ లో రాధ అనే పాత్రలో హెబ్బా నటిస్తోంది. ఫస్ట్ సినిమా ‘కుమారి 21F’ నుంచి గ్లామర్ రోల్స్ మరియు బోల్డ్ క్యారెక్టర్స్ పోషిస్తూ వచ్చిన హెబ్బా.. ఈ చిత్రంలో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. చేతిలో చేట పట్టుకొని సాధారణ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తున్న హెబ్బా లుక్ అభిమానులని షాక్ గురి చేయడంతో పాటు ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శరవేగంగా జరుపుతున్నారు. రియల్ లొకేషన్స్ లో సహజత్వానికి దగ్గరగా ఉండేలా మేకప్ – డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లేకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.