కుమారి ఆంటీ అయ్యిందే

0

కుమారి 21ఎఫ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. ఈ అమ్మడు ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను క్యాస్ చేసుకోవడంలో విఫలం అయ్యింది. ఆ సినిమా తర్వాత నటిగా వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేలా ఈమె తదుపరి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అందుకే ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అవ్వడంతో పాటు ఆమెకు వచ్చిన క్రేజ్ మెల్లగా తగ్గిపోయింది. ఆమె చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించడం లేదు. ఒక్కటి రెండు సినిమాలతో మళ్లీ సక్సెస్ కొడితే అప్పుడు ఆమె బిజీ అయ్యే అవకాశం ఉంది అనుకుంటూ ఉండగా తాజాగా ఆమె ఈ ఫొటోతో అందరి దృష్టిని ఆకర్షిచింది.

కుమారి సినిమాలో ఎంతో అందంగా ఆకర్షనీయంగా కనిపించిన హెబ్బా పటేల్ సినిమా సినిమాకు కాస్త బొద్దుగా మారింది. తాజాగా ఈ ఫొటోలో చీర కట్టకుని కాస్త లావుగా ఒక ఆంటీ మాదిరిగా కనిపించడంతో కుమారి ఏంటీ మరీ ఆంటీలా తయారయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఒరేయ్ బుజ్జి సినిమా ఫలితం కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాతో పాటు రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యింది. అవి ఎప్పటి వరకు పట్టాలెక్కేనో తెలియదు. ఆ సినిమాలతో అయినా ఈమె మళ్లీ బిజీ అవుతుందా అనేది చూడాలి. ఈలోపు ఆమె కాస్త బరువు తగ్గి మళ్లీ కుమారి లుక్ కు వస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయం.