యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

లావణ్య.. ఇంకో మెట్టు దిగింది

0

అందాల రాక్షసి సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన భామ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తర్వాత లావణ్యకు అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ.. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఒక స్థాయిని మించి మాత్రం ఎదగలేకపోయింది. చాలా వరకు కెరీర్లో మీడియం రేంజ్ హీరోలతోనే చేసింది. ఐతే గత కొన్నేళ్లలో మీడియం రేంజ్ స్టార్ హీరోల పక్కన కూడా ఆమెకు అవకాశం రాలేదు. ‘అర్జున్ సురవరం’లో నిఖిల్‌కు, ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’లో సందీప్ కిషన్‌కు, ‘చావు కబురు చల్లగా’లో కార్తికేయకు జోడీగా నటించిందామె. ఒకప్పుడు చేసిన హీరోలతో పోలిస్తే వీళ్ల రేంజ్ తక్కువే.

ఇలా సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్న లావణ్య.. ఇప్పుడు ఇంకో మెట్టు దిగినట్లే కనిపిస్తోంది. పెద్దగా పేరులేని ఒక యంగ్ హీరోకు లావణ్య జోడీగా నటించబోతోంది. ఆ హీరో పేరు నరేష్ అగస్త్య.ఎవరీ నరేష్ అగస్త్య అనుకుంటున్నారా? మూడేళ్ల కిందట కీరవాణి చిన్న కొడుకు సింహా లీడ్ రోల్ చేసిన ‘మత్తువదలరా’ మూవీ గుర్తుందా? అందులో హీరో ఫ్రెండుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన కుర్రాడే ఈ నరేష్ అగస్త్య. తొలి సినిమాలోనే చక్కటి నటనతో ఆకట్టుకున్న అగస్త్య ఇప్పుడు లీడ్ రోల్ చేయబోతున్నాడు.

అతడికి జోడీగా లావణ్య నటించబోతోంది. ఈ సినిమాను రూపొందిస్తోంది ‘మత్తు వదలరా’ టీమే. ఆ చిత్రంతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన రితేష్ రాణా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అతడి తొలి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన క్లాప్ ఎంటర్టైన్మెంటే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి కూడా హాజరయ్యాడు. తొలి చిత్రం లాగే ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, భిన్నంగా ఉండబోతోందని అంటున్నాడు రితేష్ రాణా. ఈ సినిమా లావణ్యకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.