పంజాబీ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా? పెళ్లికి రెడీ అయ్యిందా? ఆమె ఎంగేజ్ మెంట్ మార్చి 13న నిర్వహిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. టాలీవుడ్ లో హీరో నాని మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ అందం మెహ్రీన్ కౌర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతోందట..
రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి మెహ్రీన్ వెళ్లనున్నట్టు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి మనువడిని ఆమె పెళ్లి చేసుకోబోతోందని టాక్ నడుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.. త్వరలోనే మెహ్రీన్ వైవాహిక జీవితం ప్రారంభించనుందట..
హర్యానాకు మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ పెళ్లి నిశ్చయమైనట్టు సమాచారం. కాంగ్రెస్ నేత ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో బాగా పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది.
వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో మెహ్రీన్ భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి నిశ్చితార్థం మార్చి 13న ఫిక్స్ చేశారట.. దీంతో వీరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.