నెలన్నర అయినా జైల్లోనే హీరోయిన్

0

కర్ణాటక పోలీసులు డ్రగ్స్ కేసులో హీరోయిన్స్ సంజన గర్లానీ మరియు రాగిణి ద్వివేదిలను సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఇద్దరు కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంజన బెయిల్ పై బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బెయిల్ కోసం కోర్టకు వెళ్లింది. సంజన బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతున్న సమయంలో తుమకూరుకు చెందిన రాజశేఖర్.. వేదాంత్.. శివ ప్రకాష్.. రమేష్ అనే వ్యక్తులు సంజనకు వెంటనే బెయిల్ ఇవ్వాలంటూ కోర్టుకు బెదిరింపు లేఖ రాశారు. కవర్ లో బాంబు పెట్టి సంజనను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెయిల్ విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి బెదిరింపు లేఖ రావడం ఏకంగా బాంబుతో బెదిరించేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో సంజన బెయిల్ తీర్పును వాయిదా వేశారు. విచారణ వేగవంతంగా జరిగేందుకు గాను బెయిల్ ఇవ్వకుండా సంజనను జైల్లోనే ఉంచాలని విచారణ అధికారులు కోరారు. సంజన అరెస్టు అయ్యి దాదాపుగా నెలన్నర అవుతుంది. పరిస్థితులు చూస్తుంటే మరో నెలన్నర వరకు కూడా సంజన అక్కడే ఉండాల్సి రావచ్చు అనిపిస్తుంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఇతరులు కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు.