సోషల్ మీడియా ఫాలోవర్స్ పెంచుకుంటున్న హీరోయిన్స్…!

0

Heroines growing social media followers

Heroines growing social media followers

సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ ని తమ ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఫేస్ బుక్ లో మరో రికార్డు అందుకుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ గర్ల్ గా మారిపోయింది నిధి అగర్వాల్. ‘మున్నా మైఖెల్’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీకి బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని సరసన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోనూ నటించింది నిధి. ఇక పూరీ డైరెక్షన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో ఓ సినిమాలో నటిస్తోంది.

కాగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ ఫేస్ బుక్ లో 8.5 మిలియన్ ఫాలోవర్స్ ని రీచ్ అయింది. మరోవైపు ఈ బ్యూటీకి ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నిధిని ఇంస్టాగ్రామ్ లో 5.4 మిలియన్స్ ఫాలో అవుతుండగా.. ట్విట్టర్ లో 5 లక్షలమంది అనుసరిస్తున్నారు. మొత్తం మీద నిధి ఈ తరం హీరోయిన్స్ లో అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ కలిగిన వారి సరసన నిలిచింది.