Templates by BIGtheme NET
Home >> Cinema News >> మూవీ రివ్యూలపై హైకోర్టు సంచలన కామెంట్స్

మూవీ రివ్యూలపై హైకోర్టు సంచలన కామెంట్స్


సినిమా రివ్యూలపై ప్రస్తుతం భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేరళ హైకోర్టు వీటిపై ఆసక్తికరైన తీర్పు వెళ్ళడిచింది. కేరళలో ఓ రోమాలింటే అద్యతే ప్రాణాయం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ముబీన్ రుయాఫ్ రివ్యూలపై హైకోర్టుని ఆశ్రయించారు. మూవీ రిలీజ్ అయిన వారం రోజుల వరకు తన సినిమాకి రివ్యూలు రాయకుండా నియంత్రించాలని పిటీషన్ వేశారు.

దీనిపై కేరళ హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉన్న రివ్యూలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. సినిమా బాగోలేదని చెప్పడం, సినిమా నాకు నచ్చలేదు అని రివ్యూల పేరుతో విమర్శలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.

సినిమాపై నిర్మాణాత్మక విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పులేదు కాని కావాలని నాశనం చేసే విధంగా ఉండకూడదని పేర్కొంది.. స్వార్థ ప్రయోజనాలతో సినిమాను నాశనం చేసే విధంగా రివ్యూలు రాస్తే ఇక చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హైకోర్టు హెచ్చరించింది. ఇప్పుడు ఈ తీర్పు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

కేరళలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే దీనిపై భిన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కేరళ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఎలాంటి చర్చ జరుగుతుందనేది చూడాలి. ముబీన్ రుయాఫ్ కి దర్శకుడుగా ఇదే మొదటి సినిమా. లవ్ డ్రామా తో తెరకెక్కుతున్న ఆరోమాలింటే అద్యతే ప్రాణాయామం మూవీకి ఎలాంటి నెగటివ్ రివ్యూలు ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి రాకుండా ముందస్తుగా ఇలా కేరళ కోర్టులో తన సినిమాకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కేరళ హైకోర్టు బెంచ్ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూలు రాసే వారిపై ఉండే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేసింది.