Templates by BIGtheme NET
Home >> Cinema News >> మోహన్ లాల్ కూతురు ఎలా మారిపోయిందో..!

మోహన్ లాల్ కూతురు ఎలా మారిపోయిందో..!


మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ.. తన అట్రాక్టివ్ లుక్ తో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఊబకాయంతో ఎంతో ఇబ్బంది పడ్డ ఈ స్టార్ డాటర్.. తనని తాను శిల్పంగా మలుచుకొని అందరి చేత ‘ఔరా’ అనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఊబకాయంతో బాధపడుతున్న విస్మయ.. కొంతకాలం క్రితం థాయ్లాండ్కు వెళ్లింది. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో కఠినమైన ఆహార వ్యాయామ నియమాలను పాటిస్తూ బరువు తగ్గే కార్యక్రమం మొదలు పెట్టింది. అంతేకాకుండా.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో కఠినమైన శిక్షణ తీసుకుంది. ఈ కఠోర సాధన ఫలితంగానే తాను బరువు తగ్గానని ప్రకటించింది విస్మయ.

ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు విస్మయ. ఇందులో నమ్మశక్యం కాని విధంగా వెయిట్లాస్ అయిన ఫొటోలను షేర్ చేసింది. పలు వీడియోలు కూడా పోస్ట్ చేసి అభిమానులందరినీ విస్మయానికి గురిచేసింది ఈ స్టార్ డాటర్. ఈ వెయిట్ లాస్ ప్రక్రియను “జీవితాన్ని మార్చే అనుభవం” గా అభివర్ణించిన విస్మయ.. ఈ కఠోర సాధన ద్వారా తాను 22 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు.

కాగా.. విస్మయ ఒక వర్ధమాన రచయిత. ప్రస్తుతం తన మొదటి పుస్తకం ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ ను ప్రచురించే విధంగా కృషి చేస్తున్నారు. ఈ పుస్తకంలో కవితలతోపాటు ఆకర్షణీయమైన చిత్రాలు ఉంటాయట.