ఈ రూమర్ వినడానికి ఎంత బాగుంది…!

0

టాలీవుడ్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ”అయ్యప్పనుమ్ కోసియుమ్”. ఇది మలయాళంలో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై ఘన విజయం సాధించిన ఓ సినిమా. పృథ్వీరాజ్ – బిజూ మీనన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని భావించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుండి తెలుగు రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు.. ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని ఐదు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోలు ఎవరనే దానిమీద క్లారిటీ లేదు.

కాగా ఈ రీమేక్ సినిమాలో హీరోలుగా చాలామంది పేర్లు వినిపించినప్పటికీ.. చివరిగా మాస్ మహారాజా రవితేజ – రానా దగ్గుబాటి లను ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ సినిమాని చూసిన పవన్.. తెలుగు రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పుడు తమిళ హీరో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో నటిస్తాడని మరో రూమర్ పుట్టుకొచ్చింది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ లో పవన్ కళ్యాణ్.. బిజు మీనన్ చేసిన పోలీస్ అధికారి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారననేది దీని సారాంశం. ఈ రూమర్ వినడానికి ఎంత బాగుందో కదా. ఇప్పటికైనా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ లో నటించే హీరోలు ఎవరో అనౌన్స్ చేసి రూమర్స్ కి చెక్ పెడతారేమో చూడాలి.