Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ మరణంలో దుబాయ్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రమేయం!

సుశాంత్ మరణంలో దుబాయ్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రమేయం!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సుశాంత్ కేసులో కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలపడంతో సర్వోన్నత న్యాయస్థానం సుశాంత్ సింగ్ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జరీ చేసింది. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీం తీర్పుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి నుంచి సుశాంత్ ది ఆత్మహత్య కాదని…హత్య అయ్యుండొచ్చనే కారణాలు వెల్లడిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న బీజీపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం తీరుపై స్పందిస్తూ ‘సీబీఐ జయహో’ అని ట్వీట్ చేశారు.

అంతేకాకుండా ఓ ప్రముఖ ఛానల్ తో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ మరణంలో దుబాయ్ లో కూర్చున్న మనీలాండరర్లు.. ప్రొఫెషనల్ కిల్లర్స్ ప్రమేయాన్ని కూడా తోసిపుచ్చలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ లో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ క్రైమ్స్ ఉండవని.. సుశాంత్ కేసులో సిల్లీ స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై బిజెపి ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందిస్తూ.. ఇప్పుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కొత్త కోణాలు వెలువడుతున్నాయని.. ఈడీ మరియు సీబీఐ వాటన్నింటినీ పరిశీలిస్తాయని అనుకుంటున్నానని అన్నారు. ఇక ఈ కేసుపై మాజీ రా అధికారి ఎన్కె సూద్ స్పందిస్తూ సుశాంత్ మరణానికి అండర్ వరల్డ్ లింక్స్ ఉన్నాయని.. అండర్ వరల్డ్ క్రిమినల్స్ తమ పనిని ఖచ్చితత్వంతో పూర్తి చేస్తారని.. కేసుని డైవర్ట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని చెప్పుకొచ్చారు.