Templates by BIGtheme NET
Home >> Cinema News >> సూపర్ స్టార్ చేయబోతున్న ఓటీటీ ప్రాజెక్ట్ ఇదే

సూపర్ స్టార్ చేయబోతున్న ఓటీటీ ప్రాజెక్ట్ ఇదే


ఇండియాలో ఓటీటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండటంతో అంతా కూడా ఓటీటీ వెంట పరుగులు తీస్తున్నారు. దాంతో స్టార్స్ అంతా కూడా ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్స్ నుండి చిన్న వారి వరకు అంతా కూడా ఓటీటీ మూవీ లేదా వెబ్ సిరీస్ లను చేస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఓటీటీ ఎంట్రీకి రెడీ అవ్వడం ఇదే ప్రథమం అంటున్నారు.

వార్ చిత్రంతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన హృతిక్ రోషన్ త్వరలో క్రిష్ 4 చిత్రంతో వస్తాడని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తూ వెబ్ సిరీస్ కు హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంగ్లీష్ లో సూపర్ హిట్ అయిన ది నైట్ మ్యానేజర్ అనే వెబ్ సిరీస్ ను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలో నటించబోతున్న ఈ వెబ్ సిరీస్ లో దిశా పటానీ మరియు టబులు నటించబోతున్నారు.

డిస్నీ హాట్ స్టార్ వారు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. అన్ని ఇండియన్ భాషల్లో డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ఈ వెబ్ సిరీస్ తర్వాత క్రిష్ 4 సినిమాను హృతిక్ చేయబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ కోసం హృతిక్ భారీ మొత్తంలో పారితోషికంను తీసుకుంటున్నట్లుగా బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.