Templates by BIGtheme NET
Home >> Cinema News >> దగ్గుబాటి కోడలికి సుస్వాగతం పలికిన అక్కినేని కోడలు!!

దగ్గుబాటి కోడలికి సుస్వాగతం పలికిన అక్కినేని కోడలు!!


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రానా పెళ్లి తంతు ముగిసింది. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. తన తాతయ్య లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న ఈ వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు రాంచరణ్ అల్లు అర్జున్ లతో పాటు కొద్దిమంది మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్లివేడుకలో అక్కినేని కుటుంబం నుండి నాగచైతన్య సమంతలు ప్రత్యేకంగా నిలిచారు. నాగచైతన్య భార్యగా సమంతకు దగ్గుబాటి కుటుంబంతో బంధం ఏర్పడింది. రానా మెహిందీ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ముఖ్యంగా షెల్ డిటైలింగ్ కలిగిన ఆ ఎల్లో డిజైనర్ వేర్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇక పెళ్ళిలో సమంత చక్కగా చీరలో హాజరయ్యింది. అయితే తాజాగా రానా – మిహికల పెళ్లిలో కుటుంబ సభ్యులతో సమంత కూడా కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యామిలీ ఫోటో షేర్ చేసి.. పెళ్లికూతురు మిహిక కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సమంత పోస్ట్ చేస్తూ.. ‘అందమైన మిహికా.. కుటుంబంలోకి నీకు స్వాగతం’ అని కాప్షన్ పెట్టింది. ఇక కొత్త పెళ్లికూతురుకు సమంత స్వాగతం పలకడం పట్ల నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత మీరు చేసింది చాలా గ్రేట్.. అంటూ ఆ ఫోటోను లైక్స్ కొడుతూ షేర్ చేస్తూ ఫోటో వైరల్ చేస్తున్నారు. ఇక ఓ పెద్ద ఇంటి కోడలిగా సమంత సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. అంతేగాక తను కూడా దగ్గుబాటి ఫ్యామిలీలో ఒక భాగంగా మారినందుకు ఆనందంగా ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం నెట్టింట సామ్ పిక్ వైరల్ అవుతోంది.