‘వకీల్ సాబ్ ’ ..అతడి ఫోన్ నెంబర్ ప్లీజ్

0

ఒక్క ఛాన్స్ అని సినిమావాళ్లు కలవరిస్తూంటారు. ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూంటారు. ఎందుకంటే సరైన సినిమా ఒక్కటి చాలు ఓవర్ నైట్ స్టార్ ని చేయటానికి. ఒక్కో సినిమా ఒక్కొక్కరికి లైఫ్ ఇస్తుంది. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినాఎంత రాసినా రానిీ పేరు ఒక్కసారిగా వచ్చేస్తుంది. దాంతో వాళ్లు ఓవర్ నైట్ లో బిజీ అయ్యిపోతారు. అందుకే సినిమావాళ్లు శుక్రవారం తమ జాతకాలు మారిపోతాయని చెప్తూంటారు. అలాంటి పరిస్దితే ‘వకీల్ సాబ్ ’ సినిమాకు డైలాగులు రాసిన రచయితకు ఎదురయ్యింది.

ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే డైలాగులు చాలా మందికి నచ్చేసాయి.ప్రకాష్ రాజ్ పవన్ మధ్య వచ్చే డైలాగులకు థియోటర్ ఊగిపోతోంది. రివ్యూలలో కూడా అదే విషయం ప్రస్దావించారు. అలాగే సినిమా వాళ్లు సైతం ఆ డైలాగులకు వస్తున్న రెస్పాన్స్ చూసి అతనెవరా అని ఆరా తీస్తున్నారు. తమ సినిమాకు అతనిచేత రాయిస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఫోన్ నెంబర్ కోసం దిల్ రాజు క్యాంప్ ని సంప్రదిస్తున్నారట. ఇంతకీ ఎవరా రైటర్ ..అతని ప్రస్దానం ఏమిటి..ఇంతకు ముందు ఏ సినిమాలకు రాసాడు అంటే..

వకీల్ సాబ్ సినిమా డైలాగ్ రైటర్ పేరు మామిడాల తిరుపతి . తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందినవాడు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే తిరు… తన సినీ ప్రస్తానం మొదలెట్టారు. 13 ఏళ్ల నుంచి దిల్రాజు టీమ్లో చేస్తున్నారు. ఆ టీమ్లో రైటింగ్ డైరక్షన్ డిపార్టమెంట్ లో కొనసాగుతున్నారు. బయిట ఎన్ని ఆఫర్స్ వచ్చినా దిల్ రాజు క్యాంప్ లోనే కొనసాగటం కలిసొచ్చింది. 2011లో వేణుశ్రీరామ్ డైరెక్షన్లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాకు అఫీషియల్ గా పనిచేసారు. ఆ సినిమాకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ తర్వాత 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు.

ఇక 2017లో వచ్చిన మహేశ్బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాకు స్క్రిప్ట్ అసిస్టెంటుగా చేసారు. మళ్లీ వేణు శ్రీరామ్ డైరక్షన్ లో వచ్చిన ‘ఎంసీఏ’కు డైలాగ్ రైటరుగానూ వ్యవహరించారు. అయినా అతని పేరు హైలెట్ కాలేదు. మొన్న శుక్రవారం విడుదలైన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్కు డైలాగులు రాశారు. ఆ డైలాగులకు మంచి రెస్పాన్స్ రావటంతో అంతటా హాట్ టాపిక్ గా మారారు. కెరీర్ గాడిలో పడినట్లైంది. త్వరలోనే డైరక్టర్ గా ఆయన పరిచయం అయ్యే అవకాసం ఉందని సమాచారం. అదీ దిల్ రాజు బ్యానర్ లోనే లాంచింగ్ అంటున్నారు. ఈ లోగా డైలాగు రైటర్ గా బిజీ అవుతారు.