స్టైలిష్ వైష్ణవ్.. లవర్ బాయ్ సినిమాలకు సిద్ధమేనా..?

0

మెగా ఫ్యామిలీ యువహీరో వైష్ణవ్ తేజ్ ఈ ఏడాది ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. డెబ్యూ సినిమాతోనే మంచి హిట్ అందుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టాడు. చిన్నసినిమా అయినప్పటికీ ఉప్పెన మూవీ మొత్తంగా 60 పైనే వసూల్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మెగాహీరో ఫస్ట్ మూవీ ఉప్పెన రిలీజ్ ముందే తన రెండో సినిమా కంప్లీట్ చేసేసాడు. గతేడాది లాక్డౌన్ లోనే ఆ సినిమా షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా జంగిల్ బుక్ అనే పేరుతో ప్రచారంలో ఉన్నటువంటి ఆ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు.

ఈ సినిమాలో వైష్ణవ్ జోడిగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. వైష్ణవ్ తేజ్ తాజాగా స్టైలిష్ ఫోటోషూట్స్ కూడా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైష్ణవ్ డాపర్ లుక్ మెగా అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. స్టైలిష్ సూట్ అండ్ బ్లాక్ ప్యాంటు షూస్ తో వైష్ణవ్ మెరిసిపోతున్నాడు. చూస్తుంటే కోరమీసాలతో ఇంకా ఉప్పెన ఆశీ క్యారెక్టర్ నుండి బయటికి రానున్నట్లుగా ఉన్నాడని నేటిజన్లు భావిస్తున్నారు. కానీ ఈ స్టైలిష్ లుక్కులో మెగాహీరో లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. మరి ఇకపై లవర్ బాయ్ సినిమాలలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లే అనిపిస్తుంది.