Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2021 ప్రథమార్థం `వకీల్ సాబ్` దేనా?

2021 ప్రథమార్థం `వకీల్ సాబ్` దేనా?


2020 ఆద్యంతం అల్లు అర్జున్ పేరు మార్మోగింది. అల వైకుంఠపురములో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే గాక .. పాటల పరంగా కూడా చార్ట్ బస్టర్ నిలిచింది. అల వైకుంఠపురములో క్లీన్ ఫ్యామిలీ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా సరికొత్త రికార్డుల్ని అందుకుంది. నాన్ బాహుబలి రికార్డుని కొట్టేశారు బన్ని.

2021లో మళ్లీ అంతకుమించిన వేవ్ కనిపిస్తోంది. ఓవైపు క్రైసిస్ కొనసాగుతున్నా కానీ అదేమీ పట్టనట్టు వకీల్ సాబ్ రికార్డుల గురించిన ముచ్చట వేడెక్కిస్తోంది. ఈ సినిమా తొలి మూడు రోజుల వసూళ్లతోనే బ్రేక్ ఈవెన్ సాధించేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక కంటెంట్ పరంగా.. పాటల పరంగా రీరికార్డింగ్ పరంగా పెర్ఫామెన్సెస్ పరంగా వకీల్ సాబ్ పేరు మార్మోగిపోతోంది. అందుకే 2020 ఆయనది అయితే 2021 ఈయనది అంటూ చెబుతున్నారు. పవన్ హవా ఆ రేంజులో ఉంటుందని ఈ ఏడాది ప్రూవ్ అవుతోంది మళ్లీ.

ఇప్పటివరకు 2021 తెలుగు చిత్ర పరిశ్రమకు ఫలవంతమైన సంవత్సరంగా ప్రూవ్ అయ్యింది. కోవిడ్ భారీ దెబ్బ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు విజయవంతమైన చిత్రాల పరంపరతో బాగా నడుస్తున్నాయి. ఇంతకుముందు ఉప్పెన-జాతిరత్నాలు- నాంది ఇవన్నీ బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. స్కేల్ పరంగా అవన్నీ మీడియం రేజ్ అయితే వకీల్ సాబ్ పెద్ద సినిమా. ఇది పెద్ద స్థాయి వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద పవన్ మానియా ముందు ఇంకేదీ నిలవదని కూడా ప్రూవ్ అవుతోంది. 2021లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందన్న అంచనా ఏర్పడింది. అన్నిటినీ మించి క్రిటికల్ గా ది బెస్ట్ అని నిరూపించింది.

ఇక మునుముందు ఆచార్య-నారప్ప- ఖిలాడీ-బీబీ3- కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రాలు ప్రథమార్థంలోనే రిలీజ్ కి రావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితిలో వాయిదా పడడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఈ సన్నివేశంలో 2021 ఫస్టాఫ్ లో రిలీజైన పెద్ద బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ మాత్రమే అవుతుందని అంచనా. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి ఇవన్నీ సజావుగా రిలీజైతే అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుందేమో!