బయో పిక్ అనుమానం ఫై రామలింగ రాజు కోర్ట్ కి..!

0

ఇండియాలో బ్యాంకులకు ఆర్ధిక సంస్థలకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్లపై నెట్ ఫ్లిక్స్ ఓ సిరీస్ రూపొందించింది. ‘బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్ ‘ పేరిట ఈ సిరీస్ నేటి నుంచి ప్రసారం కావలసి ఉంది. కాగా ఇది ప్రసారం కాకుండా చూడాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ సీరిస్ సత్యం కుంభకోణం నేపథ్యంలో తన బయోపిక్ తీశారనే అనుమానం ఉందని ఇవాళ రామలింగరాజు కోర్టుకు వెళ్లడంతో ఈ మేరకు ‘బ్యాడ్ బాయ్స్ బిలియనీర్స్’ సిరీస్ ని విడుదల చేయవద్దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ వెబ్ సిరీస్ బ్యాంకులను జనాన్ని మోసగించి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా సహారా సుబ్రతా రాయ్ నీరవ్ మోదీ సత్యం రామలింగ రాజులను ఉద్దేశించి తీసిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

ఇప్పటికే విడుదల అయిన వెబ్ సిరీస్ ట్రైలర్లో ఆయా పాత్రలను కూడా చూపారు. కాగా ఇదివరకే ఈ వెబ్ సిరీస్ మీద ‘ఫ్యుజిటివ్ డైమండ్ మర్చంట్’ మెహుల్ చోక్సీ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది తమని ఉద్దేశించే తీశారని విడుదలకు ముందు దీన్ని తాము చూడవలసి ఉందని ఢిల్లీ హైకోర్టులో తన లాయర్ ద్వారా అప్పీలు దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో సత్యం రామలింగరాజు ఈ సీరిస్ పై కోర్టుకు వెళ్ళగా ప్రసారం నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఆర్థిక నేరగాళ్లపై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆగ్రహం ఉన్న నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కి జనం నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదల ఆగిపోవడంతో సినీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.