అల బన్నీ డైలాగ్ ను వాడుతున్న హైదరాబాద్ పోలీస్

0

అల్లు అర్జున్ ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా పాటలు ఎంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ కూడా అద్బుతంగా ఉందంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా అల వైకుంఠపురంలోని ఒక డైలాగ్ ను ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేయడం జరిగింది. ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన విషయమై ఈ వీడియోను షేర్ చేశారు.

సినిమాలో బ్రహ్మాజీతో అల్లు అర్జున్ ఒక సీన్ లో మరీ ప్రధానంగా ఒక స్త్రీ వద్దు అంటే దాని అర్థం అస్సలు వద్దని… చెప్తాడు. ఆ డైలాగ్ ను 13 సెకన్ల వీడియోగా కట్ చేసి పోలీసులు షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆడవారిని గౌరవించాలని.. ఆడవారిపై అఘాయిత్యాలను నిలిపేయాలనేది ఈ పోస్ట్ ఉద్దేశ్యం. ఆడవారికి గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఆమె ఆడవారు మాత్రమే కాదు మీరు జెంటిల్మన్ అనే విషయాన్ని గుర్తించుకోండి అంటూ పోలీసులు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా విభిన్నంగా ప్రచారం చేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఈతరహాలో ప్రచారం చేసినా ఆడవారిపై అఘాయిత్యాలు ఆగుతాయో చూడాలి.