మొదటి సారి హద్దులు చెరిపేశాను

0

హీరోలు.. హీరోయిన్స్ ఒక గిరి గీసుకుని దాని లోపులోనే నటిస్తూ ఉంటారు. దాన్ని దాటి నటిస్తే కెరీర్ కష్టాల్లో పడుతుందనే ఉద్దేశ్యంతో వారు హద్దులు పెట్టుకుని నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోలు హీరోయిన్స్ ఎక్కువగా పాజిటివ్ గా నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనినే ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోవడం అంటారు.

జనాల్లో తమ గురించి అభిప్రాయం మేరకు సినిమాను చేయాలని అనుకుంటూ ఉంటారు. కాని వెబ్ సిరీస్ లో మాత్రం వేరే విధంగా ఉంటుంది. వెబ్ సిరీస్ ల్లో పాత్రలపై నమ్మకాలు ఉండవు. ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ లకు ఆధరణ పెరుగుతుంది. కనుక ఖచ్చితంగా వెబ్ సిరీస్ ల్లో ఎలా నటించినా కూడా ప్రేక్షకులు ప్రతిభను మాత్రమే చూస్తారు అనే అభిప్రాయం ఉంది.

హీరోయిన్ గా పదేళ్ల పాటు కొనసాగిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం విభిన్నమైన పాత్రలో నటించిందట. ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ అమ్మడు నటించబోతుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ లో సమంత విభిన్నంగా నటించబోతుంది.. పాకిస్తానీ ఉగ్రవాదిగా కనిపిస్తుందనే వార్తలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో సమంత మాట్లాడుతూ వెబ్ సిరీస్ కోసం తన ఇన్నేళ్ల కెరీర్ లో హద్దులు చెరిపేశాను. ఇప్పటి వరకు తనకు తాను పెట్టుకున్న హద్దులను ఈ వెబ్ సిరీస్ తో చెరిపేసినట్లుగా సమంత చెప్పడంతో నిజంగానే వెబ్ సిరీస్ లో ఈమె లేడీ విలన్ గా కనిపించబోతుందేమో అనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈసారి ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు.