టామ్ అమీర్ లా సోలో హీరో కూడా చేస్తాడా?

0

సంక్రాంతి పండగ రిలీజ్ లకు ఎంతో పెద్ద సెంటిమెంట్. పండగ సెలవులు కలిసొస్తే బంపర్ హిట్టు ఖాయమేనని అంచనా వేస్తుంటారు. అంతకుముందు ఇంకేదీ లేదా? అంటే డిసెంబర్ అక్కినేని హీరోలకు కలిసొస్తుందని ఓ అంచనా. క్రిస్మస్ కానుకగా నాగార్జున సినిమాలు కానీ ఆ కుటుంబానికి చెందిన సినిమాలు కానీ వస్తే అవి హిట్టవుతుంటాయి.

కానీ ఈసారికి సుప్రీం హీరో ఆ రూల్ ని బ్రేక్ చేస్తాడనే భావిస్తున్నారు. అతడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. క్రైసిస్ లో థియేట్రికల్ రిలీజయ్యే బిగ్ మూవీ ఇదే కానుందని ఓ అంచనా.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకునే అవకాశం కల్పించగా డిసెంబరు నాటికి ఓవరాల్ గా థియేటర్ల పరిస్థితి మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బివిఎస్.ఎన్ ప్రసాద్ `సోలో బ్రతుకే సో బెటర్` నిర్మిస్తున్నారు. సుబ్బు ఈ చిత్రానికి దర్శకుడు. సాయిధరమ్ కి.. డెబ్యూ డైరెక్టర్ కి బిగ్ బ్రేక్ వస్తుందనే భావిస్తున్నారు. టెనెట్ కి టామ్ క్రూజ్.. సూరజ్ పె మంగల్ భారీ మూవీకి అమీర్ బిగ్ బూస్ట్ ఇచ్చారు. నేరుగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసిన స్టార్లుగా రికార్డులకెక్కారు. అలానే ఈసారి సాయి తేజ్ కూడా ఆ తరహా ప్రచారానికి తెర తీస్తారేమో చూడాలి.